యెరు బ్బయలు
న్యాయాధిపతులు 6:14

అంతట యెహోవా అతనితట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా

న్యాయాధిపతులు 6:32

ఒకడు తన బలిపీఠమును విరుగగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను.

న్యాయాధిపతులు 8:29

తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను.

న్యాయాధిపతులు 8:35

మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని యింటివారికి ఉపకారము చేయకపోయిరి.

బెదాను
న్యాయాధిపతులు 13:1-16
1

ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిష్తీయులచేతికి అప్పగించెను.

2

ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడునైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.

3

యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు.

4

కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము.

5

నీవు గర్భవతివై కుమారునికందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా

6

ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను; అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడనుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతో చెప్పలేదు

7

గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవువరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై యుండునని నాతో చెప్పెననెను.

8

అందుకు మానోహ నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకువచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా

9

దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక, ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవునిదూత ఆమెను దర్శించెను.

10

ఆ సమయమున ఆమె పెనిమిటియైన మానోహ ఆమె యొద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి ఆనాడు నాయొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను.

11

అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి ఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడునేనే అనెను.

12

అందుకు మానోహ కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా

13

యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను; ఆమె ద్రాక్షావల్లినుండి పుట్టినదేదియు తినకూడదు,

14

ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను.

15

అప్పుడు మానోహ మేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా

16

యెహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను; నీవు దహనబలి అర్పించనుద్దేశించిన యెడల యెహోవాకు దాని నర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు.

యెఫ్తా
న్యాయాధిపతులు 11:1-33
1

గిలాదువాడైన యెఫ్తా పరాక్రమముగల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు; గిలాదు యెఫ్తాను కనెను.

2

గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి యింట నీకు స్వాస్థ్యము లేదనిరి.

3

యెఫ్తా తన సహోదరులయొద్దనుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తాయొద్దకు వచ్చి అతనితో కూడ సంచరించుచుండెను.

4

కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా

5

అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున

6

గిలాదు పెద్దలు టోబుదేశమునుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి.

7

అందుకు యెఫ్తా మీరు నాయందు పగపట్టి నా తండ్రి యింటనుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నాయొద్దకు రానేల? అని గిలాదు పెద్దలతో చెప్పెను.

8

అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీయొద్దకు మళ్లి వచ్చితివిు; నీవు మాతోకూడ వచ్చి అమ్మోనీయులతో యుద్ధముచేసిన యెడల, గిలాదు నివాసులమైన మా అందరిమీద నీవు అధికారి వవుదువని యెఫ్తాతో అనిరి.

9

అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసికొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతి కప్పగించిన యెడల నేనే మీకు ప్రధానుడనవుదునా? అని గిలాదు పెద్దల నడుగగా

10

గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయుదుము; యెహోవా మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి.

11

కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను.

12

యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని యడుగగా

13

అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను.

14

అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి యిట్లనెను

15

యెఫ్తా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు.

16

ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.

17

అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపీ; నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివసించిరి.

18

తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు గదా.

19

మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనను హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి నీ దేశముగుండ మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగా

20

సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశములో బడి వెళ్లనియ్యక, తన జనులనందరిని సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను.

21

అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతి కప్పగింపగా వారు ఆ జనమును హతముచేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని

22

అర్నోను నది మొదలుకొని యబ్బోకువరకును అరణ్యము మొదలుకొని యొర్దానువరకును అమోరీయుల ప్రాంతములన్నిటిని స్వాధీనపరచుకొనిరి.

23

కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనులయెదుట నిలువకుండ తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా?

24

స్వాధీనపరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము.

25

మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకుకంటె నీవు ఏమాత్రమును అధికుడవు కావుగదా? అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనను కలహించెనా? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనా?

26

ఇశ్రాయేలీయులు హెప్బోనులోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు?

27

ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదు గాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుట వలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చును గాక.

28

అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు.

29

యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.

30

అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినయెడల

31

నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహనబలిగా దాని నర్పించెదననెను.

32

అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్పగించెను గనుక అతడు వారిని

33

అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చువరకు ఆబేల్కెరామీమువరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేషముగా హతముచేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ అణచి వేయబడిరి.

సమూయేలు
1 సమూయేలు 7:13

ఈలాగున ఫిలిష్తీయులు అణపబడినవారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రా క ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినము లన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను .