ఈలాగు ప్రకటించెను
న్యాయాధిపతులు 2:1-3
1

యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీమునకువచ్చి యీలాగు సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.

2

మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసికొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు.

3

మీరు చేసినపని యెట్టిది? కావున నేను మీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను.

నెహెమ్యా 9:9-12
9

నీవు నీతిమంతుడవైయుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి.

10

ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహుగర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి.

11

మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రముమధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.

12

ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయియుండి వారిని తోడుకొనిపోతివి.

కీర్తనల గ్రంథము 136:10-16
10

ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.

11

వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును.

12

చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును.

13

ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును.

14

ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను ఆయన కృప నిరంతరముండును.

15

ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.

16

అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును.

యెషయా 63:9-14
9

వారి యావ ద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వ దినము లన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

10

అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశు ద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి యాయెను తానే వారితో యుద్ధము చేసెను.

11

అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసికొనెను. తన మంద కాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చిన వాడేడి ?

12

తమలో తన పరిశు ద్ధాత్మను ఉంచిన వాడేడి ? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి ?

13

తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి ? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి? యనుకొనిరి

14

పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి

యెహెజ్కేలు 20:5-32
5

ఎట్లనగా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణముచేసిన నాడును, ఐగుప్తుదేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొని ప్రమాణముచేసి నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున

6

వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.

7

అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తన కిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుటచేత మిమ్మును మీరు అపవిత్రపరచు కొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని.

8

అయితే వారు నా మాట విన నొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మాన లేదు , ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మాన లేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని.

9

అయితే ఏ అన్యజనుల యెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో , యే అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తు దేశము లోనుండి రప్పించితిని .

10

వారిని ఐగుప్తు దేశములోనుండి రప్పించి అరణ్యము లోనికి తోడుకొని వచ్చి

11

వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని . ఎవడైన వాటి ననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును .

12

మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని .

13

అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుస రింపక , తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి , నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా , అరణ్యమందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని .

14

అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో యే అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.

15

మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి , వారు నా విధులను తృణీకరించి నా కట్టడల ననుస రింపక నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా

16

ఇచ్చెదనని నేను సెలవిచ్చి నట్టియు, పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశము లోనికి వారిని రప్పిం పనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని .

17

అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి , అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని .

18

వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లల తో ఈలాగు సెలవిచ్చితిని మీరు మీ తండ్రుల ఆచారములను అనుస రింపకయు , వారి పద్ధతులనుబట్టి ప్రవర్తిం పకయు , వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచు కొనకయు నుండుడి.

19

మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి .

20

నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును .

21

అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి , తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుస రింపకయు , నా విధులను గైకొన కయు , నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నా కోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని .

22

అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలోనుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని.

23

మరియు వారు నా విధుల ననుస రింపక నా కట్టడలను తృణీకరించి , నేను విధించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచి ,

24

తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశముల లోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని .

25

నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రదుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని .

26

తొలి చూలిని అగ్నిగుండముదాటించి బలి దానముల నిచ్చుటచేత తమ్మును తాము అపవిత్రపరచు కొననిచ్చితిని.

27

కాబట్టి నర పుత్రుడా , ఇశ్రాయేలీ యులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా మీ పితరులు నాయెడల అతిక్రమముచేసి నన్ను దూషించి

28

వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశము లోనికి నేను వారిని రప్పించిన తరువాత, ఎత్తయిన యొక కొండనేగాని , దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు , అర్పణలను అర్పించుచు , అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు , పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి.

29

మీరు పోవుచున్న ఉన్నతస్థలము లేమిటని నేనడిగితిని ; కాబట్టి ఉన్నతస్థలమను పేరు నేటి వరకు వాడుకలో నున్నది.

30

కావున ఇశ్రాయేలీ యులకు ఈ మాట ప్రకటింపుము . ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే ;

31

నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించునప్పుడు , మీరు పెట్టుకొనిన విగ్రహము లన్నిటికి పూజజేసి అపవిత్రులగుచున్నారే ; ఇశ్రాయేలీ యులారా , నాయొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నావలన ఆలోచన మీకు దొరుకదు ; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు

32

అన్యజనులేమి భూమిమీది యే జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజచేతుమని మీ రనుకొనుచున్నారే . మీరు ఇచ్ఛయించినదాని ప్రకారమెన్నటికిని జరుగదు .