అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను
ప్రకటన 5:13

అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును -సింహాసనాసీనుడైయున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.

యెషయా 40:13

యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు ? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు ? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?

యెషయా 40:14

ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు ? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు ? ఆయనకు బుద్ధి మార్గము బోధించినవాడెవడు ?

యెషయా 41:28

నేను చూడగా ఎవడును లేకపోయెను నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త యెవడును లేకపోయెను .

రోమీయులకు 11:34
ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు ? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ?