బంగారు
ప్రకటన 11:1

మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చి -నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.

ప్రకటన 11:2

ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.

నిర్గమకాండము 40:3-5
3

అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెర తో కప్పవలెను.

4

నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను.

5

సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను.

యెహెజ్కేలు 41:1-5
1

తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను, ఇది గుడారపు వెడల్పు.

2

వాకిలి వెడల్పు పది మూరలు, తలుపు ఇరుప్రక్కల అయిదేసి మూరలు, దాని నిడివిని కొలువగా నలుబది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు.

3

అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను, వాకిలి ఆరు మూరలు;వెడల్పు ఏడు మూరలు.

4

ఇది అతి పరిశుద్ధస్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలు నాయెను.

5

తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయెను, మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా నాలుగేసి మూరలాయెను.

జెకర్యా 2:1

మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టుకొనిన యొకడు నాకు కనబడెను.