తలవెండ్రుకలును
దానియేలు 7:9

ఇంక సింహాసనములను వేయుట చూచితిని ; మహా వృద్ధుడొకడు కూర్చుండెను . ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తల వెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను ; దాని చక్రములు అగ్నివలె ఉండెను.

మత్తయి 28:3

ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను.

ఆయన నేత్రములు
ప్రకటన 2:18

తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము- అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా

ప్రకటన 19:12

ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

దానియేలు 10:6

అతనిశరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను , అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను . అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను