బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలిసికొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియామీద పెట్టిన మాటుగాండ్రను నమి్మ బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి.
మాటుననున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోనివారినందరిని హతముచేసిరి.
ఇశ్రాయేలీయులకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతమొకటి యుండెను; అదేదనగా వారు పట్టణములోనుండి పొగ గొప్ప మేఘమువలె లేచునట్లు చేయుటయే.
ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుకతీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మనచేత ఓడిపోవుదురుగదా అనుకొని, చంపనారంభించి, ఇశ్రాయేలీయులలో ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను హతము చేసిరి.
నేనును నాతోకూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించెదము, వారు మునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారియెదుట నిలువక పారిపోదుము.
మునుపటివలె వీరు మనయెదుట నిలువలేక పారిపోదురని వారనుకొని, మేము పట్టణమునొద్దనుండి వారిని తొలగి రాజేయువరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు; మేము వారియెదుట నిలువక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట మాని
బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములోనుండి తొలగివచ్చి మునుపటివలె ఇశ్రాయేలీయులలో గాయపరచబడినవారిని ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను రాజమార్గములలో చంపుచువచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి.
యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా.)
నీవు దురా లోచనచేసి ఇట్లనుకొందువు నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశము మీదికి పోయెదను , ప్రాకారములును అడ్డగడియలును గవునులును లేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను .
వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై , పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను , ఆ యా జనములలోనుండి సమకూర్చబడి , పశువులును సరకులును గలిగి , భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయెదను .
సెబావారును దదానువారును తర్షీషు వర్తకులును కొదమసింహముల వంటివారైన దానివారందరును నిన్ను చూచిసొమ్ము దోచుకొనుటకు వచ్చితివా ? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా ? బహుగా దోపు దోచుకొని , వెండి బంగారములను పశువులను సరకులను పట్టుకొని పోవుటకు చాల దోపుడు దోచుకొనుటకు వచ్చితివా ? అని నిన్నడుగుదురు .
కాగా నర పుత్రుడా , ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలిసికొందువు గదా?
ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనము లనేకములును గుఱ్రము లెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి
మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనుల మీద పడెదరు ; అంత్య దినములందు అది సంభవించును , అన్యజనులు నన్ను తెలిసికొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకొను సమయమున, గోగూ , నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను .
ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నిన్ను వారిమీదికి రప్పించెదనని పూర్వ మందు ఏటేట ప్రవచించుచువచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చినమాట నిన్నుగూర్చినదే గదా?
ఆ దినమున , గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబోవు ఆ దినమున, నా కోపము బహుగా రగులుకొనును ; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును గలిగిన వాడనై యీలాగు ప్రమాణముచేసితిని . ఇశ్రాయేలీయుల దేశములో మహా కంపము పుట్టును .
సముద్రపు చేపలును ఆకాశ పక్షులును భూ జంతువులును భూమి మీద ప్రాకు పురుగు లన్నియు భూమి మీదనుండు నరు లందరును నాకు భయపడి వణకుదురు , పర్వతములు నాశనమగును , కొండపేటులు పడును , గోడ లన్నియు నేల పడును
నా పర్వతము లన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను , ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును ; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారిమీదను అతనితో కూడిన జనము లనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును .
అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి
మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.
అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనినవారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.
కడమవారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.