అందుకు వారునీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసెదము, నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము
సంఖ్యాకాండము 32:25

అందుకు గాదీయులును రూబేనీయులును మోషేతో మా యేలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము.

ద్వితీయోపదేశకాండమ 5:27

నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన యెడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి.

రోమీయులకు 13:1-5
1

ప్రతి వాడును పై అధికారులకు లోబడియుండవలెను ; ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ; ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి యున్నవి .

2

కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు .

3

ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు ; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు ; వారికి భయ పడక ఉండ కోరితివా , మేలు చేయుము , అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు .

4

నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము , వారు ఊరకయే ఖడ్గము ధరింపరు ; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు .

5

కాబట్టి ఆగ్రహభయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము .

తీతుకు 3:1

అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,

1 పేతురు 2:13-15
13

మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.

14

రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంప బడినవారనియు వారికి లోబడియుండుడి.

15

ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.