అర్ఖిప్పునకును
కొలొస్సయులకు 4:17

మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.

తోడి యోధుడైన
ఫిలిప్పీయులకు 2:25

మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని.

2 తిమోతికి 2:3

క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము.

2 తిమోతికి 2:4

సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.

సంఘమునకును
రోమీయులకు 16:5
ఆసియలో క్రీస్తు కు ప్రథమఫలమై యున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు .
1 కొరింథీయులకు 16:19

ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు.

కొలొస్సయులకు 4:15

లవొదికయ లో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి.