మీరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా మీ పితరు లతో ప్రమాణముచేసిన దేశమునకు పోయి దాని స్వాధీన పరచుకొనునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.
ద్వితీయోపదేశకాండమ 4:1

కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి.

ద్వితీయోపదేశకాండమ 5:32

వారు స్వాధీనపరచుకొనునట్లు నేను వారి కిచ్చుచున్న దేశమందు వారు ఆలాగు ప్రవర్తింపవలెను.

ద్వితీయోపదేశకాండమ 5:33

కాబట్టి మీరు కుడికే గాని యెడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను.

ద్వితీయోపదేశకాండమ 6:1-3
1

నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును

2

నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే.

3

కాబట్టి ఇశ్రాయేలూ, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలుకలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను.

కీర్తనల గ్రంథము 119:4-6
4
నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.
5
ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు.
6
నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.
1 థెస్సలొనీకయులకు 4:1

మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు.

1 థెస్సలొనీకయులకు 4:2

కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము.