వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి
ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే.వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.
తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండ నశించెదరు ఇదే యెహోవా వాక్కు.
కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.
రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరువేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును.
నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును;