అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱ మేకలలోను తొలిచూలు వాటిని తీసికొని రావలెను.
నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱ మేకల మందలోని దేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్చార్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక
పదియవ భాగమిచ్చు సంవత్సరమున, అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదియవ వంతును చెల్లించి, అది లేవీయులకును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తిపొందిన తరువాత
నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటిచొప్పున నా యింటనుండి ప్రతిష్టితమైనదానిని తీసివేసి, లేవీయులకును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు.
నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై యుండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయినవారి విషయమై దానిలో ఏదియు నేనియ్యలేదు, నా దేవుడైన యెహోవా మాట విని నీవు నా కాజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను.
నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను.
భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.
ఒకడు తాను చెల్లింపవలసిన దశమభాగములలో దేనినైనను విడిపింప గోరినయెడల దానిలో అయిదవవంతును దానితో కలుపవలెను.
గోవులలోనేగాని గొఱ్ఱమేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును.
అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాని మార్చినయెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టిదాని విడిపింపకూడదని చెప్పుము.
ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని.
ఇదియు గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకలవిధమైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొద్దకు తీసికొనివచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవవంతును ఆ లేవీయులకిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.