అప్పుడు జనులందరు విని భయపడి మూర్ఖవర్తనము విడిచి పెట్టెదరు.
మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.
అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానములేనివారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధినొందుదురు.
అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానములేనివాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.
ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరి యెదుట గద్దింపుము .