కాబట్టి తమ సహో దరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొంద లేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము.
ద్వితీయోపదేశకాండమ 18:1

యాజకులైన లేవీయులకు, అనగా లేవీగోత్రీయుల కందరికి ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు; అది వారి హక్కు.

ద్వితీయోపదేశకాండమ 18:2

వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు; యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనులవలన, అనగా ఎద్దుగాని గొఱ్ఱగాని మేకగాని బలిగా అర్పించువారి వలన

సంఖ్యాకాండము 18:20-24
20

మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారి మధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.

21

ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని.

22

ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు.

23

అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై యుందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమియు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

24

అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని.

సంఖ్యాకాండము 26:62

వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువది మూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారుగనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు.

యెహొషువ 14:3

మోషే రెండు గోత్రములకును అర్ధగోత్రమునకును యొర్దాను అవతలి స్వాస్థ్యముల నిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు

యెహెజ్కేలు 44:28

వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము , ఇశ్రాయేలీయులలో వారి కెంతమాత్రమును స్వాస్థ్యము ఇయ్య కూడదు , నేనే వారికి స్వాస్థ్యము .