కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.
ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను.
నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.
భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి ; సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానము తో తిను వానికి అది దోషము .
మాంసము తినుట గాని , ద్రాక్షారసము త్రాగుట గాని , నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని , మానివేయుట మంచిది .
కాగా బలవంతులమైన మనము , మనలను మనమే సంతోషపరచు కొనక , బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.
తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను .
క్రీస్తు కూడ తన్ను తాను సంతోషపరచుకొన లేదు గాని నిన్ను నిందించువారి నిందలు నా మీద పడెను . అని వ్రాయబడి యున్నట్లు ఆయనకు సంభవించెను.