పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలనచేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనును గదా.
అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికి గాని బుద్ధిహీనుడు వివేకికాడు.
అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?
మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు , కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి .
ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.