And the men which journeyed with him stood speechless, hearing a voice, but seeing no man.
అపొస్తలుల కార్యములు 22:9

నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.

అపొస్తలుల కార్యములు 26:13

రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.

అపొస్తలుల కార్యములు 26:14

మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.

దానియేలు 10:7

దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతోకూడ నున్న మనుష్యులు దాని చూడ లేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి .

మత్తయి 24:40

ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును.

మత్తయి 24:41

ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును.