set
అపొస్తలుల కార్యములు 4:7

వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా

అపొస్తలుల కార్యములు 6:12

ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి

అపొస్తలుల కార్యములు 22:30

మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభవారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసికొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.

అపొస్తలుల కార్యములు 23:1

పౌలు మహాసభవారిని తేరిచూచి సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగలవాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను.

లూకా 22:66

ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి , ఆయనను తమ మహాసభ లోనికి తీసికొనిపోయి