అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అనుఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.
కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగా నైనను ఉండుట మంచిదని యెంచి,
సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను.
దేమా యిహ లోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను , క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి ;
లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము , అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు . తుకికును ఎఫెసునకు పంపితిని .
ఎరస్తు కొరింథు లో నిలిచిపోయెను . త్రోఫిము రోగియైనందున అతని మిలేతు లో విడిచివచ్చితిని .
శీతకాలము రాక మునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము . యుబూలు , పుదే , లిను , క్లౌదియయు సహోదరు లందరును నీకు వందనములు చెప్పుచున్నారు.
నికొపొలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించుకొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము.