through
అపొస్తలుల కార్యములు 15:23

వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగానుండిన సహోదరులకు శుభము.

అపొస్తలుల కార్యములు 18:18

పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవుపుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తలవెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.

అపొస్తలుల కార్యములు 21:3

కుప్రకు ఎదురుగా వచ్చి, దానిని ఎడమ తట్టున విడిచి, సిరియవైపుగా వెళ్లి, తూరులో దిగితివిు; అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను.

గలతీయులకు 1:21

పిమ్మట సిరియ , కిలికియ ప్రాంతముల లోనికి వచ్చితిని .

confirming
అపొస్తలుల కార్యములు 15:32

మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలైయుండినందున పెక్కుమాటలతో సహోదరులనాదరించి స్థిరపరచిరి.

అపొస్తలుల కార్యములు 16:4

వారు ఆ యా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి.

అపొస్తలుల కార్యములు 16:5

గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.