చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యము లన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలోనుండి లేచెననియు,
కొందరు ఏలీయా కనబడెననియు; కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి.
అప్పుడు హేరోదు నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను.
ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని
ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి వినిబాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడుగనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను.
ఆయన వారిని చూచి వైద్యుడా , నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి , కపెర్నహూము లో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో , ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను .
అది షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను .
నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా
సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూతచేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేల రూపాయిల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను .
ఆ పత్రికలో ఉన్న సంగతి యేదనగా నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలెనని యీ పత్రికను అతనిచేత నీకు పంపించి యున్నాను.
వారియెదుట ద్రవ్యము పెట్టి నేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను.