యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి.
ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి.
అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారి కందరికిని భయము కలిగెను . ఆ సంగతులన్నియు యూదయ కొండసీమల యందంతట ప్రచుర మాయెను .
ప్రభువు హస్తము అతనికి తోడై యుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సు లో ఉంచుకొనిరి .
అందు కందరు విస్మయ మొంది ఇది ఎట్టి మాట ? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రా త్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి .
ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరును విస్మయ మొందిరి.
ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.