
నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము.
నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమనబడును.
నాదని చాటబడిన యీ మందిరము మీ దృష్టికి దొంగలగుహయైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
ఆ మందిరమునుగూర్చిన విధి యేదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థల మంతయు అతిపరిశుద్ధము, మందిరమునుగూర్చిన విధి యిదియే.
ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధ పెట్టవలె నన్న కోరిక వారికి కలదు.
మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.