
నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను.
కాబట్టి నేను సౌందర్య మనునట్టియు బంధక మనునట్టియు రెండు కఱ్ఱలు చేతపట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచువచ్చితిని .
ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని ; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి .
సౌందర్య మను కఱ్ఱను తీసికొని జను లందరి తో నేను చేసిన నిబంధనను భంగముచేయునట్లు దానిని విరిచితిని .
అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొనియున్న గొఱ్ఱలు తెలిసికొనెను .
అప్పుడు బంధకమనునట్టి నా రెండవ కఱ్ఱను తీసికొని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదరబంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని .
నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.
ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.
జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.
అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.
అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.
అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు.