తొందరపెట్టవద్దు
లూకా 7:6

కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీ రాయనయొద్దకు వెళ్లి ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను.

గలతీయులకు 6:17

నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు.

తలుపు
లూకా 13:25

ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా , మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు

మత్తయి 25:10

వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి;