cumbered
లూకా 12:29

ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.

యోహాను 6:27

క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.

dost
మత్తయి 14:15

సాయంకాలమైనప్పుడు శిష్యులాయనయొద్దకు వచ్చిఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి.

మత్తయి 16:22

పేతురు ఆయన చేయి పట్టుకొనిప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.

మార్కు 3:21

ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

నా
లూకా 9:55

ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.(కొన్ని ప్రాచీన ప్రతులలో-మీరు ఎట్టి ఆత్మగలవారో మీరెరుగరు మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకేగాని నశింపజేయుటకు రాలేదనెను-అని కూర్చబడియున్నది)

యోనా 4:1-4
1

యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని

2

యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవైయుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని.

3

నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను.

4

అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.