ఆయన నే నితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింప వలెను ; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారి తో చెప్పెను .
ఆయన మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా (లేక , నేను నా తండ్రి మందిరములో నుండవలెనని మీరెరుగరా) అని వారితో చెప్పెను;
ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను , గ్రుడ్డివారికి చూపును , (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును
ప్రభువు హిత వత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు . అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను .
ఆయన గ్రంథము చుట్టి పరిచారకుని కిచ్చి కూర్చుండెను .
సమాజమందిరము లో నున్న వారందరు ఆయనను తేరిచూడగా , ఆయననేడు మీ వినికిడి లో ఈ లేఖనము నెరవేరినదని వారి తో చెప్ప సాగెను .
పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు.
నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.
చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.
నీవు నాకు అనుగ్రహించిన వన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు.