ఆయన నానావిధ రోగములచేత పీడింప బడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.
ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను.
అపవిత్రాత్మ పట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయననుగూర్చి విని, వెంటనే వచ్చి ఆయన పాదములమీద పడెను.
జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.
అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతివెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును.
ఆ సమాజమందిరము లో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొక డుండెను .
వాడునజరేయుడవైన యేసూ , మాతో నీ కేమి ? మమ్ము నశింపజేయ వచ్చితివా ? నీ వెవడవో నేనెరుగుదును ; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను .
అందుకు యేసు ఊరకుండుము , ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా , దయ్యము వానిని వారిమధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలి పోయెను .
అందు కందరు విస్మయ మొంది ఇది ఎట్టి మాట ? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రా త్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి .
అంతట ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను .