మరియు ఆయన వారితో ఇట్లనెనుదీపము దీప స్తంభముమీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదు గదా
ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు , మంచము క్రింద పెట్టడు గాని , లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును .
ఎవడును దీపము వెలిగించి , చాటుచోటునైనను కుంచము క్రిందనైనను పెట్టడు గాని , లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును .
నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.
నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.