విడిచి
లూకా 4:30

అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను .

లూకా 4:31

అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణము నకు వచ్చి , విశ్రాంతిదినమున వారికి బోధించు చుండెను.

కపెర్నహూము
మత్తయి 11:23

కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.

మత్తయి 17:24

వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని యడుగగాచెల్లించుననెను.

మార్కు 1:21

అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.

యోహాను 4:46

తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను.

యోహాను 6:17

అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.

యోహాను 6:24

కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.

యోహాను 6:59

ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.

జెబూలూను
యెహొషువ 19:10-16
10

మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.

11

వారి సరిహద్దు పడమటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి

12

శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబెరతునుండి యాఫీయకు ఎక్కి

13

అక్కడనుండి తూర్పుతట్టు గిత్తహెపెరువరకును ఇత్కాచీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.

14

దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.

15

కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.

16

ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము.

జెబూలూను
యెహొషువ 19:32-39
32

ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను.

33

వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సిందూరవనమును అదామియను కనుమను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి

34

అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను.

35

కోటగల పట్టణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు

36

అదామా రామా హాసోరు

37

కెదెషు ఎద్రెయీ ఏన్‌హాసోరు

38

ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అనునవి; వాటి పల్లెలుగాక పందొమి్మది పట్టణములు.

39

ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.