
పేతురాయనను చూచి–నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.
దగ్గర నిలిచి యున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను.
ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.(కొన్ని ప్రాచీన ప్రతులలో-మీరు ఎట్టి ఆత్మగలవారో మీరెరుగరు మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకేగాని నశింపజేయుటకు రాలేదనెను-అని కూర్చబడియున్నది)
అందుకాయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసికొని పోవలెను; కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను;
ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది; ఏలయనగా నన్నుగూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాననెను.
వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా–చాలునని ఆయన వారితో చెప్పెను.
ఆయన చుట్టు ఉన్నవారు జరుగబోవు దానిని చూచి–ప్రభువా , కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి .
అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగనరికెను.
అయితే యేసు–ఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను.
సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను.
ఆ దాసునిపేరు మల్కు. యేసుకత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.
యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.
మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవైయున్నవి.