నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి
నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.
నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొనియున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?
నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యయగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.
నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను.
పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.
నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.
అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును.
అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.
జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధినొందును.
అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.
లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.
జనసమూహముఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.
అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.
ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును ; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను .
జనసమూహములో కొందరు ఈ మాటలు వినినిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి;
మరికొందరుఈయన క్రీస్తే అనిరి; మరికొందరుఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా?
ఇశ్రాయేలువారలారా, యీ మాటలువినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.