ఏడ్పును
మత్తయి 24:50

ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును.

మత్తయి 24:51

అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.

లూకా 13:27

అప్పుడాయన మీ రెక్కడివారో మిమ్మును ఎరుగ నని మీతో చెప్పు చున్నాను ; అక్రమము చేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును .

లూకా 13:28

అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు , మీరు చూచు నప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు .

ప్రకటన 14:10

ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.

ప్రకటన 14:11

వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మది లేనివారై యుందురు.

ప్రకటన 16:10

అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి.

ప్రకటన 16:11

తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు.