నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నులయెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.
యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొని పోయెను.
తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను.
అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.
అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొనిపోరని చెప్పెను.
అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.
మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు.
ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేషు మెరీబా నీళ్లయొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నామీద తిరుగుబాటు చేసితిరి.
ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.
మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను.
ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను .
మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.
అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.
అహరోను తన పితరులతో చేర్చబడును; ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు.
అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.