ఒక గాలి
నిర్గమకాండము 10:13

మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను.

నిర్గమకాండము 10:19

అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహా బలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱ సముద్రములో పడవేసెను . ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలవలేదు

నిర్గమకాండము 15:10

నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి.

కీర్తనల గ్రంథము 135:7

భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.

రప్పించి
నిర్గమకాండము 16:13

కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను.

కీర్తనల గ్రంథము 78:26-29
26

ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.

27

ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.

28

వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.

29

వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.

కీర్తనల గ్రంథము 105:40

వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను . ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను .