
కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.
నీవు వారితో ఈ మాట చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగాఈ దేశనివాసుల నందరిని, దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజుల నేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.
దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములనుబట్టియు దాని యాజకుల దోషమునుబట్టియు
యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలు వారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి; రాజ సంతతివారలారా, చెవియొగ్గి ఆలకించుడి, మీరు మిస్పామీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును.