యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని . అప్పుడు ఆయన నా కాజ్ఞ ఇచ్చినదేమనగా-గడపలు కదలిపోవునట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలలమీద వాటిని పడవేసి పగులగొట్టుము ; తరువాత వారిలో ఒకడును తప్పించు కొనకుండను , తప్పించుకొనువారిలో ఎవడును బ్రదుక కుండను నేను వారినందరిని ఖడ్గముచేత వధింతును .
వారు పాతాళములో చొచ్చి పోయినను అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును ; ఆకాశమున కెక్కి పోయినను అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను.
వారు కర్మెలు పర్వతశిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చటనుండి తీసికొని వచ్చెదను; నా కన్నులకు కనబడకుండ వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేనాజ్ఞ ఇత్తును, అది వారిని కరచును .
మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయమొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుజ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.