వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.
అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమైనను కలిగినయెడల అట్టివాడు పవిత్రతపొందువరకు ప్రతిష్ఠితమైనవాటిలో దేనిని తినకూడదు. శవమువలని అపవిత్రతగల దేనినైనను స్ఖలితవీర్యుడును,
రాత్రి జరిగినదానివలన మైలపడినవాడు మీలో ఉండినయెడల వాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను.
అతడు పాళెములో చేరకూడదు; సాయంకాలమున అతడు నీళ్లతో స్నానముచేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును.
ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.