దానియేలూ , నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్య కాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము . చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.
ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించియున్నాను . అది వాస్తవము , అది యనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము వెల్లడిచేయకుమనెను .
ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా -ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.