I will
యెహెజ్కేలు 30:17

ఓనువారిలోను పిబేసెతు వారిలోను యౌవనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.

యెహెజ్కేలు 30:18

ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బల గర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెర లోనికి పోవుదురు.

యెహెజ్కేలు 30:23

ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

యెహెజ్కేలు 6:13

తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టును ఎత్తయిన కొండ లన్నిటి మీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షము లన్నిటి క్రిందను, తమ విగ్రహము లన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులై యుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

యెహెజ్కేలు 29:12

నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసెదను, పాడై పోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడై యుండును, ఐగుప్తీయులను జనముల లోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

దానియేలు 11:42

అతడు ఇతర దేశములమీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించు కొననేరదు.