Syria
ఆదికాండము 10:22

షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.

Aram
ఆదికాండము 28:5

యాకోబును పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.

న్యాయాధిపతులు 10:6

ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్‌ ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజించుచువచ్చిరి.

2 సమూయేలు 8:5

మరియు దమస్కులోనున్న సిరియనులు సోబారాజగు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరువదిరెండు వేల మందిని ఓడించి

2 సమూయేలు 10:6

దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి, బేత్రెహోబుతోను అరాము సోబాతోను చేరిన సిరియనులలోనుండి యిరువదివేలమంది కాల్బలమును, మయకా రాజు నొద్దనుండి వెయ్యిమంది బంటులను,టోబులోనుండి పండ్రెండు వేలమంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి.

2 సమూయేలు 15:8

నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా

యెషయా 7:2

అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడుచేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను.