
మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజులును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినమున నున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవారమైతివిు.
మా పితరులవలెనే మేము పాపము చేసితివిు దోషములు కట్టుకొని భక్తిహీనులమైతివిు
కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చు కొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.
ప్రభువా , మా పాపములను బట్టియు మా పితరుల దోషమునుబట్టియు , యెరూషలేము నీ జనుల చుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది . యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యములన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.