ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు , నీ కష్టార్జిత మంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు ; అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములును నీ జారత్వమును వెల్లడియగును .
నీవు సంభోగించిన నీ విట కాండ్రనందరిని నీకిష్టులైన వారినందరిని నీవు ద్వేషించు వారినందరిని నేను పోగుచేయుచున్నాను ; వారిని నీ చుట్టు పోగుచేసి సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరచెదను .
జారిణులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి , క్రోధముతోను రోషముతోను నీకు రక్తము నియమింతును .
వారి చేతికి నిన్ను అప్పగించెదను ,నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసికొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు .
వారు నీమీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తులచేత నిన్ను పొడిచి వేయుదురు.
వారు నీ యిండ్లను అగ్నిచేత కాల్చుదురు , అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు , ఈలాగు నేను నీ వేశ్యాత్వమును మాన్పింపగా నీవికను పడుపు సొమ్మి య్యక యుందువు;
మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి ; అది నాకు భార్య కాదు , నేను దానికి పెనిమిటిని కాను ;
దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును , నా చేతిలో నుండి దాని విడిపించు వాడొకడును లేకపోవును.
స్త్రీలందరు మీ కామాతురతచొప్పున చేయకూడదని నేర్చుకొనునట్లు మీ కామాతురతను దేశములో నుండకుండ మాన్పించుదును.
అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా యెందునిమిత్తము ఈ గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా
అచ్చటి వారువీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.