కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబుముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను , నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను.
వాటి రెక్కలు ఒక దానినొకటి కలిసికొనెను , ఏ వైపునకైనను తిరు గక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను .
ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి , కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు .
కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను; దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపుచెట్టు ఒకటియుండెను; ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖము లుండెను.
ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టువైపున మనుష్య ముఖమును ఆ తట్టు ఖర్జూరపుచెట్టు వైపున సింహ ముఖమును కనబడెను; ఈ ప్రకారము మందిర మంతటి చుట్టు నుండెను .
మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.