
ఆ చక్రములయొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను , ఆ నాలుగును ఒక్క విధముగానే యుండెను . వాటి రూపమును పనియు చూడగా చక్రము లో చక్రమున్నట్టుగా ఉండెను .
నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే
మేఘాంధకారములు ఆయనచుట్టునుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము .
యెహోవా , నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది .