కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను ¸యవనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్త లును వయస్సు మీరినవారును వృద్ధులును పట్టుకొనబడెదరు.
దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పారపట్టుచున్నాను, నా జనులు తమ మార్గములను విడిచి నాయొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయు చున్నాను.
ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మందిరములోనే వారి ¸యవనులను ఖడ్గముచేత సంహరించెను. అతడు ¸యవనులయందైనను,యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు.దేవుడు వారినందరిని అతనిచేతి కప్పగించెను.
నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెను మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి , కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి.
అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్ట కూడదు . వారు మందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలు పెట్టగా
నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతముచేయునదై యున్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది.
వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును, వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను; అయ్యయ్యో అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడియున్నది.
ఒకని దాయాది కాల్చబోవు వానితోకూడ ఎముకలను ఇంటి లోనుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకనిచూచి యింటిలో మరి ఎవరైన మిగిలియున్నారా ? యని అడుగగా అతడు - ఇంకెవరును లే రనును ; అంతట దాయాదిట్లనును -నీవిక నేమియు పలుకక ఊరకుండుము , యెహోవా నామము స్మరించ కూడదు ;
ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు , చిన్న కుటుంబములు చీలి పోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు