వారి నివాసస్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలములును జమ్మును అగ్నిచేత కాల్చబడును
యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.
అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును
జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.
కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టియున్నది బాధచేత నేను వినలేకుండనున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండనున్నాను.
నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.
ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను . రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా
అతని ముఖము వికారమాయెను , అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను .
శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
దమస్కు బలహీనమాయెను. పారిపోవలెనని అది వెనుకతీయుచున్నది వణకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను.