అది యెహోవా ప్రతిదండనచేయు దినము సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము .
ఇదిగో మీరు చేసినదానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమ్మి పంపివేసిన ఆ యా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును
మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును ; వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేతురు ; యెహోవా సెలవిచ్చిన మాట యిదే .
అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి , బలాఢ్యులను రేపుడి , యోధు లందరు సిద్ధపడి రావలెను .
మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి , మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి ; బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొన వలెను .
చుట్టుపట్లనున్న అన్యజనులారా , త్వరపడి రండి ; సమకూడి రండి . యెహోవా , నీ పరాక్రమ శాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము .
నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును ; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను
పైరు ముదిరినది , కొడవలిపెట్టి కోయుడి ; గానుగ నిండియున్నది ; తొట్లు పొర్లి పారుచున్నవి , జనుల దోషము అత్యధిక మాయెను , మీరు దిగి రండి .
తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే యున్నది ; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.
సూర్య చంద్రులు తేజోహీనులైరి ; నక్షత్రముల కాంతి తప్పిపోయెను .
యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు ; యెరూషలేము లోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు ; భూమ్యా కాశములు వణకుచున్నవి . అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును , ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.
అతడు ప్రకటించినదేమనగా యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు , యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు ; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి , కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది .