దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.
యెషయా 3:11

దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.

యెషయా 48:22

దుష్టులకు నెమ్మది యుండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

2 రాజులు 9:22

అంతట యెహోరాము యెహూను చూచి–యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ–నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమాధాన మెక్కడనుండి వచ్చుననెను.

రోమీయులకు 3:16

నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.

రోమీయులకు 3:17

శాంతి మార్గము వారెరుగరు .