
ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతనియొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రదు కవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా
నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?
నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకముచేసికొనుము.నా కన్ను ఇకను మేలు చూడదు.
నా దినములు గతించెను నా యోచన నిరర్థకమాయెను నా హృదయ వాంఛ భంగమాయెను.
రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.
ఆశయేదైన నాకుండినయెడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే.చీకటిలో పరచుకొనుచున్నాను
నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను.
నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును?
ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.
మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమి్మక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.