చెరపట్టపడినవారు
యెషయా 24:17

భూనివాసీ, నీమీదికి భయము వచ్చెను గుంటయు ఉరియు నీకు తటస్థించెను

యెషయా 2:19

యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు .

యెహొషువ 10:16

ఆ రాజులయిదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి.

యెహొషువ 10:17

మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజులయిదుగురు దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు

యెహొషువ 10:22-26
22

యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలోనుండి ఆ అయిదుగురు రాజులను నాయొద్దకు తీసికొనిరండని చెప్పగా

23

వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి.

24

వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి.

25

అప్పుడు యెహోషువ వారితో మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగానుండుడి; మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను.

26

తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి అయిదు చెట్లమీద వారిని ఉరిదీసెను; వారి శవములు సాయంకాలమువరకు ఆ చెట్లమీద వ్రేలాడుచుండెను.

చెరపట్టపడినవారు చేర్చబడునట్లుగా
యిర్మీయా 38:6-13
6

వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.

7

రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటి లోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు,

8

వారు యిర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులో నుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను

9

రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు అకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు.

10

అందుకు రాజునీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్తయైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా

11

ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి,

12

అచ్చటనుండి పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొని పోయి, ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటినిదింపిపాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీద నీ చంకలక్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను.

13

యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.

జెకర్యా 9:11

మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరు లేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను .